నవ్వు..నవ్వించు.. హాయిగా జీవించు

Monday, January 28, 2019

స్వామీజీ...సమాదానం..?

భక్తుడు : స్వామీజీ గారు నాకు ఈ మద్య అసలు పిచ్చి ఎక్కినట్లు ఉంటుంది. రాత్రులు నిద్ర పట్టడంలేదు. ఏం చేయాలి చెప్పండి.

స్వామీజీ : ఏమి లేదు నాయన ఒక పది రోజులు
                 1. ఫేస్బుక్
                 2. వాట్సాప్
                 3. ట్విటర్ లాంటి మెసెంజర్లు వాడటం మానేసి చూడు ఫలితం నీకే తెలుస్తుంది.

Saturday, January 26, 2019

అమ్మ..నాన్న..ఆట?

కీర్తి      : ఒరేయ్ చింటు మనిద్దరం అమ్మా నాన్న ఆట ఆడుకుందామా ...

చింటు : మరి ఆ ఆట నాకు రాదుగా ...

కీర్తి      : నేను చెప్తా లేరా .....ఏమి లేదు నేను గిన్నెలు,దబరాలు విసిరేస్తా ...నువ్వు చెప్పులు                  పుస్తకాలు విసిరెయ్యి. తర్వాత నేను డబేల్ మని తలుపు వేసుకుని బెడ్రూమ్ లోకి వెళ్తా,                    నువ్వేమో బజారు కి వెళ్లిపో ..అంతే....

ఎలా పోవాలి.....

కొడుకు : నాన్న గారు, కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంట కదా ? మరి ఆ చుట్టాలు వెళ్లి పోవాలంటే ......
నాన్న   : మీ అమ్మ .... అరవాలి😅😅😅

Thursday, January 24, 2019

అంతా వాడే....

సుబ్బారావు : నాకు 5 గురు కొడుకులు, అయితే 4 బాగా చదువుకున్నారు ఒకడు మాత్రం చదువు అబ్బక పనికి పోతుంటాడు.

వెంకట్రావు : అబ్బా ! అలాంటి వాడిని ఇంట్లో ఎలా ఉండనిచ్చావు బయటకి గెంటేయక.

సుబ్బారావు : అమ్మో ? అలా ఎలా కుదురుతుంది, మా అందరిని పోషించేది వాడే కదా.....