నవ్వు..నవ్వించు.. హాయిగా జీవించు

Saturday, January 13, 2018

Sunday, January 7, 2018

పెళ్లిబస్సు

ఒక బస్సులో కండక్టర్ మరియు ప్యాసింజర్ మద్య సంభాషణ -------

ప్యాసింజర్ : పెళ్లి అనే పదాన్ని బస్సులతో పోల్చుకోవచ్చు కండక్టర్ గారు.

కండక్టర్ : ఎలా?????

ప్యాసింజర్ : బస్సు కోసం చూసి చూసి కళ్లు కాయలు కాసాక ఒక ఎర్ర బస్సు వస్తుంది.సరేలే అని ఎక్కి ప్రయాణం చేస్తున్న కాసేపటికి పక్కన చూస్తే లగ్జరీలు, డీలక్స్ లు వెల్తుంటాయి.
అలాగే వెతికి వెతికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తర్వాత మంచి మంచి అమ్మాయిలు కనబడుతుంటారు.
కదా.......

దానికి కండక్టర్ పంచ్ డైలాగ్
...

ఎర్రబస్సు అయితే 10 రూపాయలతో తీసుకెళ్తుంది.
కాని లగ్జరీలు, డీలక్స్ లు అయితే 50 కావాలి..
ఏది బెటర్....
😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

అంతలేదు. .........

సురేష్ : మా ఇంట్లో నాకూ నా భార్యకి గొడవ పడినపుడు నేను వెంటనే మా ఇంట్లోని బావిని చెక్కలతో మూసివేస్తాను.

రమేష్ : ఎందుకు మీ ఆవిడ అలిగి దానిలో దూకుతుందనా ?

సురేష్ : అంతలేదు కోపం మీద నన్ను ఎక్కడ తోసేస్తుందో అని...............
😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧